MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 2:15 pm Posted by : MANA TOLIVELUGU

నందనవనం సమస్యలు పరిష్కరించాలి

ఎల్బీనగర్: కర్మన్‌ఘాట్ నందనవనం కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు డిమాండ్ చేశారు. బస్తీ దర్బార్‌లో స్థానికులు నీటి కొరత, కలుషిత నీరు, మురుగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి అధికారులను కలిసి పోరాడుతామని రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ కే.వీ గౌడ్, ప్రధాన కార్యదర్శి బాలస్వామి, నాయకులు సతీష్ మహాజన్, ఎం సైదులు యాదవ్, వడ్డే రఘుపతి తదితరులు పాల్గొన్నారు.